‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘టక్ జగదీష్’. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ‘‘ఇంకోసారి ఇంకోసారి’’ సాంగ్ మేకింగ్ వీడియోని మేకర్స్ విడుదల చేశారు. ఆద్యంతం అలరించేలా సాగే ఆ వీడియోను మీరూ చూసేయండి
కాగా, షైన్ స్క్రీన్స్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో నాజర్, జగపతి బాబు, రావు రమేష్, వీకే నరేష్, డానియల్ బాలాజీ, తిరువీర్, రోహిణి, దేవదర్శిని, ప్రవీణ్ ముఖ్య పాత్రలు పోషించారు. కాగా, ఈ చిత్రం ఏప్రిల్ 23న థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఇక ఈ చిత్రానికి సంగీతం: తమన్, కళ: సాహి సురేష్, కూర్పు: ప్రవీణ్ పూడి, ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ల.