Home సినిమాలు నాని ‘టక్‌ జగదీష్‌’ సినిమాలో హైలైట్ అంశాలు అవే!

నాని ‘టక్‌ జగదీష్‌’ సినిమాలో హైలైట్ అంశాలు అవే!

‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత హీరో నాని, డైరెక్టర్‌ శివ నిర్వాణ కాంబినేషన్‌ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘టక్‌ జగదీష్‌’. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్‌ 23న థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఇదిలా వుంటే ఇప్పటికే విడుదలైన టీజర్ సాంగ్స్ కు మంచి స్పందన లభించింది. ఉగాదికి ట్రైలర్ రిలీజ్ కానుంది.
అయితే ఈ సినిమాలో కుటుంబం గురించి, బంధాల గొప్పతనం గురించి చెప్పబోతున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే దర్శకుడు శివ నిర్వాణ ఇదో గొప్ప ఫ్యామిలీ డ్రామా అని పేర్కొన్నాడు. దీనికి తగ్గట్టుగానే అన్నదమ్ములు జగపతిబాబు – నాని మధ్య వచ్చే సన్నివేశాలు ప్రతీ ఒక్కరి హృదయాన్ని మెలిపెడతాయని  టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో వీరిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలవనుందని సమాచారం. అలాగే క్లైమాక్స్ లో ఆఖరి 20 నిమిషాలలో ఫ్యామిలీ డ్రామాతో పాటుగా యాక్షన్ పార్ట్ మరో హైలైట్ అని అంటున్నారు

అత్యంత ప్రముఖమైనవి

ఖరీదైన వాచ్‌తో మెరిసిన మెగాపవర్ స్టార్.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు భావిస్తుంటారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...

‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే ఊడ్చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ...

విడుదలకు ముందే ‘ఆచార్య’కు గట్టి ఎదురుదెబ్బ.. ఊహించని షాక్ లో చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన చందమామ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇక ఆచార్యలో చిరంజీవితోపాటు ఆయన కుమారుడు, మెగాపవర్‌...

అల్లు అర్జున్‌ అభిమానులకు భారీ షాక్.. ‘పుష్ప’ సినిమా విడుదల వాయిదా!

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన హ్యట్రిక్‌ మూవీ ‘పుష్ప’. ఇటీవలె విడుదల అయిన పుష్ప టీజర్‌ ప్రస్తుతం  టీజర్‌...ఇప్పటి వరకు 35 మిలియన్ల వ్యూస్‌,1 మిలియన్...

ఇటీవలి వ్యాఖ్యలు