Home ప్రత్యేకం నాని అరుదైన ఘనత.. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’

నాని అరుదైన ఘనత.. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’

67వ జాతీయ చలన చిత్ర అవార్డులను తాజాగా కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన ఓ  కార్యక్రమంలో కేంద్రం విజేతల వివరాలను వెల్లడించింది. ఈ జాబితాలో  జాతీయ ఉత్తమ చిత్రం (తెలుగు)గా నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ సినిమా అవార్డు దక్కించుకుంది. అలాగే, ఉత్తమ ఎడిటింగ్‌ విభాగంలో కూడా ‘జెర్సీ’ సినిమాకు ఎడిటర్‌గా పనిచేసిన నవీన్‌ నూలి అవార్డు కైవసం చేసుకున్నారు.

కాగా..’జెర్సీ’ చిత్రంలో నానికి జోడీగా శ్రద్ధ శ్రీనాథ్, రెబా మోనికా జాన్‌‌లు నటించారు. సత్యరాజ్, రోనిత్ కుమార్, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలు పోషించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. కథ, కథనం, మాటలు కూడా ఈయనే అందించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చగా.. సాను వర్ఘీస్ సినిమాటోగ్రఫీ అందించారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు