Home సినిమాలు నాని అభిమానులకు భారీ షాక్.. ‘టక్‌ జగదీష్‌’ మూవీ విడుదల వాయిదా

నాని అభిమానులకు భారీ షాక్.. ‘టక్‌ జగదీష్‌’ మూవీ విడుదల వాయిదా

నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత హీరో నాని, డైరెక్టర్‌ శివ నిర్వాణ కాంబినేషన్‌ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘టక్‌ జగదీష్‌’. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ చిత్రం ఏప్రిల్‌ 23న విడుదల కానుందని ఇటీవల మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ షైన్‌స్క్రీన్స్‌ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. “ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు వల్ల ‘టక్‌ జగదీష్‌’ సినిమాను విడుదల వాయిదా వేయాలని నిర్ణయించాం. త్వరలోనే మరో విడుదల తేదీ ప్రకటిస్తాం’ అంటూ ప్రకటించారు.
ఇదిలాఉంటే.. దేశంలో రోజుకు లక్ష 60 వేల‌కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 4 వేలకు పైగా కేసులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చిత్రాన్ని వాయిదా వేయడం మంచిదని ‘టక్‌ జగదీష్‌’ చిత్రయూనిట్ భావించినట్టు తెలుస్తోంది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ అమలు చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో.. ఈ సినిమాను  వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు