Home సినిమాలు నాగ చైతన్య కోసం నదిలో దూకిన అభిమాని.. ఆ తర్వాత ఏమైందంటే..?

నాగ చైతన్య కోసం నదిలో దూకిన అభిమాని.. ఆ తర్వాత ఏమైందంటే..?

నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘థ్యాంక్యూ’. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్, హర్షిత్‌ రెడ్డి నిర్మించనున్నారు. ‘‘చైతు, విక్రమ్‌ కాంబినేషన్ లో వచ్చిన క్లాసిక్‌ మూవీ ‘మనం’ ఎంత పెద్ద హిట్‌ అయిందో తెలిసిందే. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తూర్పు గోదావరిలో జరుపుకుంటోంది. దీంతో షూటింగ్‌ జరుగుతున్న ప్రాంతానికి అక్కినేని అభిమానులంతా భారీ ఎత్తున తరలి వెళ్తున్నారు. తమ అభిమాన హీరోను ప్రత్యేక్షంగా చూసేందుకు పెద్ద ఎత్తున షూటింగ్ స్పాట్‌కి చేరారు. దీంతో నాగచైతన్య అక్కడికి వచ్చిన అభిమానులందరిని కలిసి వారితో ఫొటోలు దిగాడు.

అయితే ఓ స‌న్నివేశంలో భాగంగా చైతూ గోదావ‌రిలో బోట్‌పై ప్ర‌యాణిస్తున్నాడు. ఆయ‌న‌ను చూసేందుకు వంద‌లాది మంది ప్ర‌జ‌లు అక్క‌డ‌కు చేరుకున్నారు. చైతూను ద‌గ్గ‌ర‌గా చూడాల‌ని భావించిన ఓ వ్య‌క్తి బ్రిడ్జి పై నుండి ఏకంగా గోదావ‌రిలోకి దూకాడు. అదృష్ట‌వ‌శాత్తు ఆయ‌న ప్రాణాల‌తో బ‌య‌ప‌టప‌డ్డాడు. కాగా, షూటింగ్ త‌ర్వాత ఆ వ్య‌క్తిని పిలిపించుకొని ఫొటో దిగిన నాగ చైతన్య ఇంకోసారి ఇలాంటి పనులు చేయోద్దంటూ సున్నితంగా చెప్పాడట.

ఇదిలావుంటే..నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్ స్టొరీ’.. ‘ఫిదా’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రం కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా రైట్స్‌ కూడా భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. ఆంధ్రా హక్కులు రూ.15 కోట్లకు అమ్ముడుపోగా ఓవర్సీస్‌ హక్కులు రూ.6 కోట్లకు అమ్ముడైనట్లు టాక్‌ వినిపిస్తోంది. నైజామ్‌లో కూడా మంచి ధర పలికేది కానీ ఇక్కడ ఆసియన్‌ మూవీస్‌ సొంతంగా రిలీజ్‌ చేస్తుందట. మొత్తం‌గా ఈ సినిమా అప్పుడే 50 కోట్ల రూపాయల బిజినెస్‌ చేసినట్లు సమాచారం.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు