ప్రతి వారం మాదిరే ఈ వారం కూడా రెండు పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’.. కార్తి హీరోగా వస్తున్న ‘సుల్తాన్’ సినిమాలు ఏప్రిల్ 2న విడుదల అవుతున్నాయి. గతకొన్ని రోజులుగా ప్రమోషన్స్ తో దుమ్మురేపుతున్న వైల్డ్ డాగ్ ఏప్రిల్ 2 న విడుదలవుతుంది. ఇందులో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ విజయ్‌వర్మగా నాగార్జున నటించారు. నాగ్ టీమ్‌ను దర్శకుడు అహిషోర్ సోలమన్ స్క్రీన్‌పై వీరోచితంగా చూపించనున్నారు. ముఖ్యంగా 60వ పడిలో కూడా నాగ్ 20 ఏళ్ల కుర్రాడిలా చేస్తున్న స్టంట్స్ వావ్ అనిపిస్తున్నాయి.
నాగ్ ‘వైల్డ్ డాగ్ ‘ సినిమాకు కార్తి ‘సుల్తాన్’ నుంచి ముప్పు తప్పదా..!
మరోవైపు కార్తీ, రష్మికా జంటగా ‘సుల్తాన్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడదలైన సినిమా ట్రైలర్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్2న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. నిజానికి కార్తీ సినిమాలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంటుంది. ఇప్పుడు సుల్తాన్ కూడా అదే అంచనాలతో వస్తుంది. దాంతో బాక్సాఫీస్ దగ్గర నాగార్జున, కార్తీ మధ్య ఫైట్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇదిలాఉంటే.. ఏప్రిల్ 2న విడుదల కాబోతున్న వైల్డ్ డాగ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక తాజాగా జరిగింది. ఈ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ కార్తి ‘సుల్తాన్’ సినిమా పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏప్రిల్ 2వ తేదీన కార్తి నటించిన సుల్తాన్ విడుదల కాబోతుంది. ‘ఊపిరి’ సినిమా తో కార్తి నాకు తమ్ముడు అయ్యాడు. తమ్ముడు కార్తి సుల్తాన్ సినిమా, నా సినిమా రెండు కూడా మంచి విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నాను అని నాగార్జున అన్నారు.