Home ప్రత్యేకం నాగ్ 'వైల్డ్ డాగ్': విడుదలైన 19 రోజులకే ఓటీటీలోకి...

నాగ్ ‘వైల్డ్ డాగ్’: విడుదలైన 19 రోజులకే ఓటీటీలోకి…

అక్కినేని నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’కు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూల్లే రాబట్టింది. అయితే ఏప్రిల్ 2న విడుదలైన ఈ చిత్రం మూడు వారాల్లోనే ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్‌లో విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 21 అర్థరాత్రి 12 గంటల నుంచి వైల్డ్ డాగ్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. అంటే కేవలం 19 రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలో విడుదల అయిందన్నమాట. వాస్తవానికి ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే విడుదల కావాల్సింది. కానీ థియేటర్లు తెరవడంతో ఈ సినిమాను నేరుగా విడుదల చేశారు.

కాగా, నిజజీవిత సంఘటనలతో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున  ఏసీపీ విజయ్‌ వర్మగా దుమ్మురేపాడు. ఉగ్రవాదిని పట్టుకునేందుకు హీరో తన టీమ్‌తో ఏం చేశాడనే ఒకే ఒక పాయింట్‌ చుట్టూ ఈ కథ తిరుగుంది. ఎటువంటి కమర్షియల్‌ హంగులు లేకపోయినప్పటికీ, సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకి అహిషోర్‌ సాల్మన్ దర్శకత్వం వహించగా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించారు. దియా మిర్జా, సయామీ ఖేర్, అతుల్‌ కులకర్ణి, అలీ రెజా తదితరులు కీలక పాత్రలో నటించారు

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు