Home ప్రత్యేకం నాగ్ 'వైల్డ్ డాగ్' ప్రతీ ఒక్క భారతీయుడు గర్వంగా చూడదగిన సినిమా..: చిరంజీవి

నాగ్ ‘వైల్డ్ డాగ్’ ప్రతీ ఒక్క భారతీయుడు గర్వంగా చూడదగిన సినిమా..: చిరంజీవి

అక్కినేని నాగార్జున కథానాయకుడిగా అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం(ఏప్రిల్‌ 2)న విడుదలై మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున  ఏసీపీ విజయ్‌ వర్మగా దుమ్మురేపాడు. గత రెండేళ్లుగా సరైన హిట్‌ లేక సతమతమవుతున్న కింగ్‌ నాగ్‌.. ‘వైల్డ్‌ డాగ్‌’తో హిట్‌ ట్రాక్‌ ఎక్కాలని చూశాడు. అనుకున్నట్లే తొలి నుంచే ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా భారీగా వస్తాయని ట్రేడ్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి వైల్డ్ డాగ్ స్పెషల్ షో చూసిన తర్వాత చిత్రబృందంపై ప్రశంసల జల్లు కురిపించారు. “ఇప్పుడే వైల్డ్ డాగ్ చూసాను. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అతి దారుణమైన టెర్రరిస్ట్ ఘాతుకం వెనుక ఉన్న కిరాతకులని  పట్టుకున్న ఆ ఆపరేషన్ ని కళ్ళకి కట్టినట్టుగా చూపించారు. ఆ ఆవేశాన్ని ప్రాణాలకి తెగించి ఆ నీచుల్ని వెంటాడి వేటాడిన మన రియల్ లైఫ్ హీరోలని ఆ రియల్ హీరోలని మరింత అద్భుతంగా చూపించారు. వైల్డ్ డాగ్ టీంని దర్శకుడు సోలొమన్.. నిర్మాత నిరంజన్ రెడ్డిని  మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది ప్రతివారం విడుదలయ్యే చిత్రాల్లోఒకటి కాదు..ప్రతి ఒక్క భారతీయుడు తెలుగు వారు గర్వంగా చూడవల్సిన చిత్రం.. డోంట్ మిస్ దిస్ వైల్డ్ డాగ్ ” అని చిరు ట్వీట్ చేశారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు