Home సినిమాలు నాగార్జున ‘వైల్డ్‌ డాగ్‌' ట్రైలర్‌ టాక్: ఏసీపీ విజయ్‌ వర్మ పాత్రలో అదరగొట్టిన 'కింగ్'

నాగార్జున ‘వైల్డ్‌ డాగ్‌’ ట్రైలర్‌ టాక్: ఏసీపీ విజయ్‌ వర్మ పాత్రలో అదరగొట్టిన ‘కింగ్’

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా, బాలీవుడ్‌ నటి దియా మీర్జా హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’. ఈ సినిమాకు అహిషోర్‌ సాల్మోన్‌ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 2న విడుదలకానుంది. అయితే తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని మెగాస్టార్ చిరంజీవి ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేశారు. ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించేలా సాగిన ట్రైలర్‌ను మీరూ చూసేయండి.

ఇదిలావుంటే.. హైదరాబాద్‌లో జరిగిన వాస్తవ సంఘటనల నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఈ సినిమాలో నాగార్జున ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) ఏసీపీ విజయ్‌ వర్మ పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని పంచుతుంది అని చిత్రానిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రకటించింది. కాగా.. ఈ చిత్రానికి కిర‌ణ్ కుమార్ డైలాగ్స్ రాయగా, షానీల్ డియో సినిమాటోగ్రఫీ అందించారు. తమన్ నేపథ్య సంగీతం సమకూర్చారు. డేవిడ్ ఇస్మలోన్ యాక్షన్ డైరెక్టర్. శ్రావణ్ కటికనేని ఎడిటర్. ఈ చిత్రంలో అతుల్ కులకర్ణి, ఆలీ రెజా, బిలాల్ హుస్సేన్, ప్రకాష్ సుదర్శన్, మయాంక్ ప్రకాష్, రుద్ర ప్రదీప్, అనీష్ కురువిళ్ళ, కెసి శంకర్, షవ్వార్ అలీ, అవిజిత్ దత్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు