నటీనటులు : నాగార్జున, దియా మిర్జా, సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి, అలీ రెజా తదితురులు
నిర్మాతలు : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
దర్శకత్వం : అహిషోర్ సాల్మన్
సంగీతం : తమన్
అక్కినేని నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాత. వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన ఈ చిత్రంలో కింగ్ నాగ్ ఏసీపీ విజయ్ వర్మగా నటించాడు. ఈ క్రమంలో వైల్డ్ డాగ్ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. నాగార్జున వైల్డ్ డాగ్ గా ఎలా మెప్పించారు? అన్నది ఈ సమీక్షలో చూద్దాం.
కథ:
ఏసీపీ విజయ్ వర్మ(నాగార్జున ) నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అధికారి. ఉగ్రవాదుల్ని పట్టుకోవడం కంటే కూడా అంతం చేయడానికే ఇష్టపడుతుంటాడు. ఈ క్రమంలోనే పుణెలోని జాన్స్ బేకరిలో బాంబు బ్లాస్ట్ జరుగుతుంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న డీఐజీ మోహన్ (అతుల్ కులకర్ణి) విజయ్ వర్మకు ఆ బాధ్యతలు అప్పగిస్తాడు. ఈ క్రమంలో ఇండియన్ ముజాహిదీన్‌కి చెందిన ఖలీద్ హస్తం ఉందని కనిపెడతాడు. అతను భారత్ నుంచి నేపాల్‌కి వెళ్లాడని తెలుసుకున్న విజయ్ వర్మ తన బృందంతో కలిసి అక్కడికి వెళతాడు. నాగ్ ఇన్వెస్టిగేషన్లో బయటపడిన నిజాలు ఏంటి? ఈ బ్లాస్ట్ చేసిన టెర్రరిస్ట్‌ను బ్లాక్ డాగ్ టీమ్ ఎలా పట్టుకుంది? అనేదే మిగతా చిత్ర కథ.
విశ్లేషణ:
2007 లో హైదరాబాద్‌లోని గోకుల్ చాట్ వద్ద బాంబు పేళ్లుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఆ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘వైల్డ్ డాగ్’. ఇలాంటి కథను అందరికి నచ్చేలా చెప్పడం కొంతవరకు విజయం సాధించాడు దర్శకుడు అహిషోర్. ఇక ఎన్ఐఏ అధికారి విజయ్ వర్మ పాత్రలో ఒదిగిపోయాడు నాగార్జున. యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా నటించాడు. రా ఏజెంట్ ఆర్యాపండిత్ పాత్రలో సయామీ ఖేర్ చక్కగా నటించింది. యాక్షన్ సీన్స్ లో నాగార్జునతో పోటీపడి మరీ ఆదరగొట్టింది. విజయ్ వర్మ టీమ్ సభ్యుడిగా బిగ్‌బాస్ ఫేమ్ అలీరెజా ఆకట్టుకున్నాడు.. విజయ్ వర్మ భార్య ప్రియగా దియా మిర్జా పర్వాలేదనిపించింది. అతుల్ కులకర్ణి, ప్రకాశ్, ప్రదీప్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. సాంకేతిక విభాగాల్లో షానీల్ డియో కెమెరా విభాగానికి ఎక్కువ మార్కులు పడతాయి. తమన్ నేపథ్య సంగీతం బాగుంది.
ప్లస్ పాయింట్స్: నాగార్జున నటన, సేకండాఫ్, నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్: కథ, కథనం, ఫస్టాఫ్
రేటింగ్: 2.5/5