Home సినిమాలు నాగార్జున మూవీకి కాజ‌ల్ గ్రీన్‌సిగ్న‌ల్‌.. అందాల విందుతో హీటెక్కించనున్న చందమామ!

నాగార్జున మూవీకి కాజ‌ల్ గ్రీన్‌సిగ్న‌ల్‌.. అందాల విందుతో హీటెక్కించనున్న చందమామ!

సౌత్ ఇండియన్ భాషా చిత్రాల్లో స్టార్ హీరోల రేంజ్ క్రెడిట్ కొట్టేసి తనకంటూ ఫ్యాన్ బేస్ ఏర్పర్చుకుంది కాజల్ అగర్వాల్. పలు వైవిద్యభరితమైన పాత్రలు పోషిస్తూ దశాబ్ద కాలంగా సౌత్ ఇండస్ట్రీని ఏలుతూ వస్తున్న కాజల్ వరుసగా సినిమాలు చేయాలని నిర్ణయించుకుందట. అది కూడా అందాల విందు చేస్తూ తనదైన నటనతో ఆకట్టుకోనుందని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే, కాజ‌ల్ తాజాగా అక్కినేని నాగార్జున‌తో ఓ సినిమాకు ఓకే చేసిన‌ట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్క‌నున్న చిత్రంలో కాజ‌ల్ కీలక పాత్రలో నటించనుందని తెలుస్తోంది.

హైదరాబాద్‌లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న త‌ర్వాత చిత్ర‌యూనిట్ గోవాకు ప‌య‌న‌మైంది. ప్ర‌స్తుతం బీచ్ సిటీలో షూటింగ్ కొన‌సాగుతుంది. అయితే, గోవా షెడ్యూల్ పూర్త‌యిన త‌ర్వాత మిగిలిన షూటింగ్ కోసం నాగార్జున అండ్ టీం హైద‌రాబాద్‌కు రానుంది. కాగా.. మార్చి 31 నుంచి కాజ‌ల్ షూటింగ్‌లో జాయిన్ కానుంద‌ట‌. ప్ర‌వీణ్ స‌త్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ‌ర‌త్‌మరార్-సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. మరోవైపు కాజ‌ల్ త‌మిళంలో రెండు సినిమాలకు సంతకం చేయడంతోపాటు ఓ టీవీ షో కూడా వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రించనుంది.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు