Home సినిమాలు నాగార్జున నిర్మాతగా వైష్ణవ్ తేజ్ మూడో చిత్రం.. దర్శకుడెవరంటే?

నాగార్జున నిర్మాతగా వైష్ణవ్ తేజ్ మూడో చిత్రం.. దర్శకుడెవరంటే?

మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే సూపర్ స్టార్ట్ అయ్యాడు. ‘ఉప్పెన’తో ప్రేక్షకుల ముందుకొచ్చి అందరి మన్ననలు పొందాడు. ఆయన నటనపై మెగా స్టార్ చిరంజీవి సూపర్ స్టార్ మహేష్ బాబు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సహా పలువురు సినీ స్టార్స్ సైతం ప్రశంసలు గుప్పించడం చూశాం. ఈ నేపథ్యంలో మంచి ఊపు మీదున్న వైష్ణవ్ తేజ్ కోసం నిర్మాతలు పోటీపడుతున్నారట. తన తొలి సినిమా విడుదల కాకముందే వైష్ణవ్ తేజ్ తన రెండో సినిమాను కూడా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు కొండపొలం అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. ఈ సినిమా ఓ ఫేమస్ నవల ఆధారంగా తెరకెక్కింది. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మ‌రి కొద్ది రోజుల‌లో విడుద‌ల కానుంది. 

అయితే, ఇక మూడో సినిమాని వైష్ణ‌వ్ తేజ్ ఎవ‌రితో చేస్తాడు, ఏ నిర్మాణ సంస్థ రూపొందింస్తుంద‌ని అనేక అనుమానాలు అభిమానుల‌లో ఉండ‌గా, దానిపై ఓ క్లారిటీ వ‌చ్చింది. మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ త‌న మూడో చిత్రాన్ని డెబ్యూ డైరెక్ట‌ర్‌తో చేస్తాడ‌ట‌. ఆ సినిమా ను అక్కినేని నాగార్జున మనం ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నిర్మించబోతున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే వైష్ణవ్ తేజ్ కోసం నాగార్జున కథను కూడా సిద్దం చేయించాడట. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో చాలా కాలంగా సహాయ దర్శకుడిగా చేస్తున్న వ్యక్తి ఈ సినిమా తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఒక మంచి ప్రేమ కథను క్యారీ చేస్తూ వైష్ణవ్ తేజ్ హీరోగా సినిమా రూపొందించేందుకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని సమాచారం. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దీనిపై మరికొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు