Home సినిమాలు నాగార్జునకు గట్టి ఎదురుదెబ్బ.. ‘వైల్డ్‌ డాగ్’ మూవీ కలెక్షన్స్ ఎంతంటే..

నాగార్జునకు గట్టి ఎదురుదెబ్బ.. ‘వైల్డ్‌ డాగ్’ మూవీ కలెక్షన్స్ ఎంతంటే..

విభిన్న కథా చిత్రాల్లో నటించేందుకు కింగ్‌ నాగార్జున ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో ‘వైల్డ్‌ డాగ్’చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై నిరంజన్‌రెడ్డి నిర్మించారు. వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన ఈ చిత్రంలో కింగ్‌ నాగ్‌  ఏసీపీ విజయ్‌ వర్మగా అదరగొట్టాడు. ఉగ్రవాదిని పట్టుకునేందుకు నాగ్ తన టీమ్‌తో ఏం చేశాడనే ఒకే ఒక పాయింట్‌ చుట్టూ ఈ కథ తిరుగుంది.  దియా మిర్జా, సయామీ ఖేర్, అతుల్‌ కులకర్ణి, అలీ రెజా తదితరులు కీలక పాత్రలు పోషించారు.

అయితే బాక్సఫీసు వద్ద తొలిరోజు మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమాకు రెండో రోజు నుండి ఊహించని షాక్ తగిలింది. ఈ మూవీ మొదటి రోజున రూ.1.21 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా.. రెండో రోజు నుండి వసూళ్లు సగానికి పైగా పడిపోయాయి. రెండో రోజు ఈ సినిమా 64 లక్షలు మాత్రమే రాబట్టింది.  ఇక నాలుగో రోజు వైల్డ్ డాగ్ కలెక్షన్స్ ఇంకా దారుణంగా నమోదయ్యాయి.  నైజాంలో 8లక్షలు సీడెడ్ లో 3లక్షలు ఉత్తరాంధ్రలో 4లక్షలు ఈస్ట్ గోదావరిలో 3.2 లక్షలు వెస్ట్ గోదావరిలో 2 లక్షలు గుంటూరులో 2.2 లక్షలు నెల్లూరులో 1.8 లక్షలు కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా వైల్డ్ డాగ్ నాలుగో రోజు 27 లక్షలు మాత్రమే వసూలు చేసింది. మొత్తంగా ఇప్పటివరకు వైల్డ్ డాగ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 3.10 కోట్లు అలాగే రూ.6 కోట్లు గ్రాస్ నమోదు చేసింది. ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ 9.4కోట్లుగా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే వైల్డ్ డాగ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాటడం కష్టమే అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు