Home సినిమాలు ‘నాంది' తొలి రోజు కలెక్షన్స్.. బాక్సాఫీస్ వద్ద అల్ల‌రోడి రచ్చ మాములుగా లేదుగా..

‘నాంది’ తొలి రోజు కలెక్షన్స్.. బాక్సాఫీస్ వద్ద అల్ల‌రోడి రచ్చ మాములుగా లేదుగా..

అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘నాంది’. శుక్రవారం (19న) విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. ఎస్‌.వి.2 ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సతీశ్‌ వేగేశ్న నిర్మించిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, ప్రియదర్శి, శ్రీకాంత్‌ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే, విడుదలైన తొలి రోజే సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. నరేశ్‌ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది.

ఇక చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ సినిమాకు హిట్ టాక్‌ రావడంతో బాక్సాఫీస్‌ వద్ద ‘నాంది’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ‘నాంది’ ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ. 49 లక్షలు షేర్, రూ. 72 లక్షల గ్రాస్ వసూలు చేసింది. నైజాంలో రూ. 18 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5.5 లక్షలు, ఈస్ట్‌ గోదావరిలో రూ. 5.1 లక్షలు, వెస్ట్‌ గోదావరిలో రూ. 2.2 లక్షలు, గుంటూరులో 3.5 లక్షలు, కృష్ణాలో 3.2లక్షలు, నెల్లూరులో రూ.2 లక్షలు, ఓవర్సీస్‌లో రూ.2 లక్షలు కలెక్షన్లు రాబట్టింది. 

కాగా, ఇప్పటికే ‘నాంది’ సినిమాకి  రూ. 2.70 కోట్ల బిజినెస్‌ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని రూ. 3 కోట్లుగా నిర్ణయించుకున్నారు. అయితే ఈ సినిమా తొలి రోజు రూ. 49 లక్షలు వసూలు చేయడంతో.. లక్షాన్ని చేరుకోవాలంటే మరో రూ. 2.51 కోట్లు వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. శని, ఆదివారాలు రావడం, సినిమాకు హిట్ టాక్ రావడంతో మరో రెండు రోజుల్లో నాంది కలెక్షన్లు భారీగా ఉండోచ్చని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు