Home సినిమాలు నందమూరి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: ఉగాది రోజున 'బాలయ్య-బోయపాటి'ల మూవీ టైటిల్

నందమూరి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: ఉగాది రోజున ‘బాలయ్య-బోయపాటి’ల మూవీ టైటిల్

బాల‌కృష్ణ‌-బోయ‌పాటి క్రేజీ కాంబినేష‌న్ లో తెరకెక్కుతున్న చిత్రం బీబీ3 (వ‌ర్కింగ్ టైటిల్‌). ఈ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమా పేరును ఉగాది రోజున ప్రకటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై యంగ్ ప్రొడ్యూస‌ర్‌ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్నారు. మ్యూజిక్‌ మిస్సైల్‌ ఎస్‌.ఎస్‌. థమన్‌ సంగీతం అందిస్తున్నారు.
కాగా, ఈ సినిమా కోసం బాలయ్య న్యూలుక్‌లోకి మారిపోయాడు. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్‌ బాలయ్య సరసన నటిస్తోంది. బాలయ్య 106వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మే28న  ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విడుదల చేయనున్నారు. ఇదిలాఉంటే.. టాలీవుడ్‌లో  నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ ఎంత సూపర్‌  హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్‌తో బాలయ్యకు  మంచి సక్సెస్ అందించిన  బోయపాటి శ్రీను, ఆ తర్వాత కూడా ‘లెజెండ్’ మూవీతో మరో బ్లాక్‌ బాస్టర్‌ను అందించాడు. ఈ సినిమా సింహాకు మించిన భారీ సక్సెస్‌ను సాధించింది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు