Home వార్తలు దేశానికి 4 రాజధానులు కావాలి: మమతా డిమాండ్‌

దేశానికి 4 రాజధానులు కావాలి: మమతా డిమాండ్‌

సువిశాల భారతదేశానికి ఒకటే రాజధాని ఎందుకుండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు. దేశానికి నాలుగు రాజధానులు ఉండాలని, రొటేటింగ్ పద్ధతిలో వాటిని వాడుకోవాలని సూచించారు.జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా కోల్‌కతాలోని నేతాజీ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ రాజధానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.దేశ్‌నాయక్‌ దివాస్‌గా జరుపుకునే నేతాజీ పుట్టిరోజు గురించి మనందరికీ తెలిసినా, ఆయన మరణం గురించి మాత్రం ఎవరికీ తెలియదని అన్నారు. 


అయితే,బ్రిటీష‌ర్లు యావ‌త్ భారత్ దేశాన్ని కేవ‌లం కోల్‌క‌తా నుంచే పాలించార‌ని, దేశంలో ఒకే ఒక్క రాజ‌ధాని ఎందుకు ఉండాల‌ని ఆమె ప్ర‌శ్నించారు. ఇవాళ దేశ‌నాయ‌క్ దివ‌స్‌ను సెల‌బ్రేట్ చేసుకుంటున్న‌ట్లు ఆమె చెప్పారు.  నేతాజీని దేశ‌నాయ‌క్ అని ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్‌ పిలిచేవార‌ని, కానీ ప‌రాక్ర‌మ్ దివ‌స్ అని బీజేపీ నాట‌కాలు చేస్తున్న‌ట్లు ఆమె ఆరోపించారు. అలాగే,నేతాజీ పోర్ట్‌ పేరును శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ డాక్‌గా మార్చడంపై మమత విమర్శలు కురిపించారు. నేతాజీ సిద్ధాంతాలను పాటిస్తున్నామని చెప్పుకుంటున్న భాజపా.. ఆయన ప్రతిపాదించిన ప్రణాళిక కమిషన్‌ను ఎందుకు రద్దు చేసిందని ప్రశ్నించారు. కేవలం ఎన్నికల సమయంలోనే వారికి నేతాజీ గుర్తొస్తారని దుయ్యబట్టారు. నేతాజీ జయంతిని పరాక్రమ్‌ దివస్‌గా ప్రకటించినప్పుడు కనీసం తనను సంప్రదించలేదని మమత ఆరోపించారు.Attachments area

అత్యంత ప్రముఖమైనవి

‘వకీల్ సాబ్’ తొలి వారం వసూళ్లు.. బాక్సఫీసు వద్ద పవర్ స్టార్ ప్రభంజనం!

పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ వెంకటేశ్వర...

ప్రభాస్ ‘సలార్‌’ మూవీ నుండి క్రేజీ అప్‌ డేట్‌

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ప్రధాన పాత్రలో ‘కేజీయఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌నీల్‌ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’. పాన్‌ ఇండియన్‌ చిత్రంగా తెరకెక్కనున్న ‘సలార్‌’లో ప్రభాస్‌ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. అయితే ఈ...

మహేష్-త్రివిక్రమ్ మూవీ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్షేషనల్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.  అయితే ప్రస్తుతం మహేష్ బాబు 'సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్‌తో బిజీగా...

‘అఖండ’గా బాలయ్య గర్జన.. ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న పవర్ ప్యాక్డ్ టీజర్

'సింహా', 'లెజెండ్‌' చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూడో చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించారు...

ఇటీవలి వ్యాఖ్యలు