Home సినిమాలు ‘దృశ్యం 2’లో రానా.. బాబాయ్ అబ్బాయ్ ల కాంబినేషన్ కుదిరింది!

‘దృశ్యం 2’లో రానా.. బాబాయ్ అబ్బాయ్ ల కాంబినేషన్ కుదిరింది!

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గతకొంతకాలంగా మల్టీస్టారర్ సినిమాలకు ప్రాధాన్యతనిస్తూ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే రామ్, మహేష్ బాబు, వరుణ్ తేజ్, పవన్ కళ్యాణ్, వంటి స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేశాడు. అయితే వెంకటేష్ అభిమానులు మాత్రం ఎప్పటి నుంచో అన్న కొడుకు దగ్గుబాటి రానాతో కలిసి సినిమా చేయాలని కోరుకుంటున్నారు. అయితే ఎట్టకేలకు ఆ కాంబినేషన్ కుదిరిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

అయితే, వెంకటేష్ తాజాగా ఓకే చెప్పిన ‘దృశ్యం 2’ చిత్రంలో రానా కూడా కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. వెంకటేష్ తాజా చిత్రం అసురన్ రీమేక్ నారప్ప ఇప్పటికే షూటింగ్ పూర్తైపోయింది. ఈ సినిమాతో పాటు ఎఫ్ 3లోనూ నటిస్తున్నాడు వెంకటేష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది.

కాగా, ఇప్పుడు దృశ్యం 2 చిత్రీకరణలో పాల్గొనేందుకు సిద్దమవుతున్నాడు వెంకీ. ఈ మధ్యే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం కూడా జరిగింది. ఇక ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కీలకమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ పాత్రకు రానా అయితే సరిగ్గా సరిపోతాడని దర్శకుడు జీతూ జోసెఫ్ భావించడంతో రానాకు ఈ విషయం చెప్పారు. ఆయనకు కూడా కథ నచ్చడంతో వెంటనే సుముఖత వ్యక్తం చేసాడని తెలుస్తోంది. కాగా, వెంకటేష్, రానాను కలిసి వెండితెరపై చూడాలని ఎంతో కాలంగా వేచి చూస్తున్న అభిమానులకు ఇదొక గుడ్ న్యూస్ గా చెప్పొచ్చు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు