Home సినిమాలు దూకుడు మీదున్న ప్రభాస్.. హృతిక్‌తో భారీ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్..!

దూకుడు మీదున్న ప్రభాస్.. హృతిక్‌తో భారీ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్..!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ మాంచి ఫామ్‌లో ఉన్నారు. బాహుబలి సినిమాతో వరల్డ్ స్టార్ అయిన ఈ హీరో.. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ మూవీ చేస్తూనే అటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో మరో సినిమా ‘ఆదిపురుష్’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ప్రభాస్ నటిస్తున్న స‌లార్ చిత్రం ఏప్రిల్ 14,2022న విడుద‌ల కానుంది.ఇక ప్ర‌భాస్- నాగ్ అశ్విన్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న చిత్రం వేసవిలో పట్టాలెక్కనుండగా, ఈ మూవీని సైంటిఫిక్ థ్రిల్ల‌ర్‌గా భారీ బ‌డ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌లో తెర‌కెక్కించ‌నున్నారు.

కాగా.. సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్‌గా, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే, ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యాక ప్ర‌భాస్‌.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్‌తో క‌లిసి స్టైలిష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. వార్, బ్యాంగ్ బ్యాంగ్ ఫేమ్ సిద్ధార్ద్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. యష్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు