Home సినిమాలు దూకుడు పెంచిన వైష్ణ‌వ్‌ తేజ్.. ఆ స్టార్ హీరో కాదన్న కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన...

దూకుడు పెంచిన వైష్ణ‌వ్‌ తేజ్.. ఆ స్టార్ హీరో కాదన్న కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగా మేనల్లుడు!

తొలి సినిమా ప్రభావం కథానాయకుల మీద గట్టిగానే ఉంటుంది. అది హిట్టయిందంటే చాలు దర్శకనిర్మాతలు అతడితో కలిసి పని చేసేందుకు తహతహలాడుతుంటారు. ఒకవేళ తొలి సినిమాయే ఫ్లాప్‌ అయిందంటే ఆ హీరోతో సినిమా అంటేనే వెనకడుగు వేస్తారు. కానీ ఇక్కడ మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ నటించిన మొట్టమొదటి సినిమా ఉప్పెనంత విజయాన్ని నమోదు చేసుకుని అతడికి స్పెషల్‌ క్రేజ్‌ తెచ్చిపెట్టింది. పైగా మెగా కాంపౌండ్‌ నుంచి వచ్చాడన్న పేరు ఉండనే ఉంది. దీంతో అతడు తన క్రేజ్‌ను బాగానే క్యాష్‌ చేసుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే వైష్ణవ్ తేజ్ తో సినిమాల కోసం నిర్మాతలు కూడా పోటీ పడుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం నేచురల్ స్టార్ నాని రిజెక్ట్ చేసిన ఓ కథను వైష్ణవ్ తేజ్ ఓకే చేశారని తెలుస్తోంది. ఇటీవల నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథను ఓకే చేశాడు. అది హీరో నాని చేస్తే బాగుంటుందని భావించిన ఆయన నానికి కథ చెప్పగా.. నాని రిజెక్ట్ చేశారట. దీంతో అదే కథను వైష్ణవ్ తేజ్‌కు వినిపించడంతో ఆ స్టోరీ నచ్చి వైష్ణవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది.

ఇదిలావుంటే.. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్.. క్రిష్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఉప్పెన షూటింగ్ పూర్తైన తర్వాత ఈ సినిమాను పూర్తి చేసాడు వైష్ణవ్. కొండపాలం పేరుతో ఈ సినిమా రూపొందుతుంది. ఆ నవల ఆధారంగానే సినిమాను తెరకెక్కిస్తున్నాడు క్రిష్. కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ అంతా పూర్తి చేసాడు. రకుల్ ప్రీత్ ఈ సినిమాలో హీరోయిన్ కావడం విశేషం. అయితే ఈ సినిమా విడుదలకు ముందే దాదాపు 14 కోట్ల వరకు ప్రీ బిజినెస్ చేసినట్లు సమాచారం.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు