Home ప్రత్యేకం దుమ్మురేపుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ బర్త్‌డే సీడీపీ: 'తగ్గేది లే'

దుమ్మురేపుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ బర్త్‌డే సీడీపీ: ‘తగ్గేది లే’

చాలా మంది ఫ్యాన్స్ కు తమ అభిమాన నటుల బర్త్‌ డేలకు సీడీపీ(కామన్‌ డిస్‌ప్లే పిక్చర్‌) పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ఇలా చేయడం ద్వారా తమ అభిమానాన్ని చాటుకోవడమే కాకుండా.. తమ అభిమాన నటుల క్రేజ్‌ను యావత్ ప్రపంచానికి తెలిసేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్‌ 8న పుట్టిన రోజు జరుపుకోనున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ సీడీపీను సుమారు 46 మంది నటీనటులు విడుదల చేశారు. అలాగే ‘సర్వ శిక్షా అభియాన్‌.. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి’ అనే సందేశాన్ని కూడా జతచేశారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే సినిమాలో నటిస్తున్నాడు.  ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్లు, ఇటీవల విడుదలైన ప్రిల్యూడ్‌ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, ధనంజయ్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. రష్మికా మందన్నా హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతదర్శకుడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను ఆగస్టు 13న విడుదల చేయనున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

ఖరీదైన వాచ్‌తో మెరిసిన మెగాపవర్ స్టార్.. ధర తెలిస్తే కళ్లు తిరుగుతాయ్

సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని ఓ రేంజ్ లో ఉంటాయి. దీంతో సాధారణంగా వాటి ధరెంతో తెలుసుకోవాలని అభిమానులు భావిస్తుంటారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...

‘వకీల్ సాబ్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజే ఊడ్చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించారు. శ్రీ...

విడుదలకు ముందే ‘ఆచార్య’కు గట్టి ఎదురుదెబ్బ.. ఊహించని షాక్ లో చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన చందమామ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఇక ఆచార్యలో చిరంజీవితోపాటు ఆయన కుమారుడు, మెగాపవర్‌...

అల్లు అర్జున్‌ అభిమానులకు భారీ షాక్.. ‘పుష్ప’ సినిమా విడుదల వాయిదా!

స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన హ్యట్రిక్‌ మూవీ ‘పుష్ప’. ఇటీవలె విడుదల అయిన పుష్ప టీజర్‌ ప్రస్తుతం  టీజర్‌...ఇప్పటి వరకు 35 మిలియన్ల వ్యూస్‌,1 మిలియన్...

ఇటీవలి వ్యాఖ్యలు