Home సినిమాలు దుమ్మురేపుతున్న “వకీల్ సాబ్” ప్రమోషన్స్.!

దుమ్మురేపుతున్న “వకీల్ సాబ్” ప్రమోషన్స్.!

దాదాపు మూడేళ్ల తర్వాత పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్‌ సాబ్‌’ మూవీతో బిగ్‌ స్క్రీన్‌పై ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు. ఆయన నటించిన ‘అజ్ఞాతవాసి’ విడుదలై మూడేళ్లు అవుతుండటంతో వెండితెరపై ఆయనను చూసేందుకు అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చుస్తున్నారు. అయితే 2020లోనే వకీల్‌ సాబ్‌ మూవీ విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రీల్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీలో విజయవంతమైన ‘పింక్‌’ రీమేక్‌గా రూపొందుతుంది ఈ సినిమా. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ సమర్పిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ‘మగువా మగువా’, ‘సత్యమేవ జయతే’ పాటలు, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.ఇదిలాఉంటే.. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ను భారీగానే ప్లాన్ చేశారు మేకర్స్. ఈ మార్చి నేలను మ్యూజికల్ మార్చ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, నిన్నటి నుంచి ఆఫ్ లైన్ ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసేసారు చిత్రబృందం. ఈరోజు చిత్రయూనిట్ దుండిగల్ ఎంఎల్ఆర్ఐటి కాలేజ్ లో మ్యూజిక్ ఫస్ట్ ను ప్లాన్ చేసి మరింత రీచ్ సెట్ చేసారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇది ప్రారంభం కానుంది. ఇందులో సంగీత దర్శకుడు థమన్, దర్శకుడు వేణు శ్రీరామ్ లు పాల్గొననున్నట్టు తెలుస్తుంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు