Home ప్రత్యేకం దుమ్మురేపుతున్న 'వకీల్ సాబ్' కొత్త పోస్టర్...

దుమ్మురేపుతున్న ‘వకీల్ సాబ్’ కొత్త పోస్టర్…

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. ఏప్రిల్ 9న విడుదల ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. తొలి రోజు నుంచి కలెక్షన్ల వరద పారిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 100 కోట్ల క్లబ్‌లో చేరి.. బ్రేక్ ఈవెన్ సాధించి.. నిర్మాతల్ని లాభాల బాట పట్టించింది. అయితే తాజాగా వకీల్ సాబ్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ విడుదల చేశారు.

ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ పోస్టర్ లో వకీల్ సాబ్ తెర ముందు తెర వెనుక ఉన్నటువంటి వాళ్లందరి ఫోటోలను జతచేశారు. పవన్ కళ్యాణ్ ను మధ్యలో పెట్టి.. ఓవైపు అనన్య, నివేదా థామస్, అంజలి, శ్రీరామ్ వేణు లను జత చేశారు. అలాగే మరోవైపు ప్రకాష్ రాజ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నిర్మాత దిల్ రాజులను సెట్ చేశారు. అలాగే ఈ పోస్టర్ ఒక్కొక్కరు ఒక్కో పనిలో నిమగ్నమై ఉన్నట్లు ఎడిట్ చేసి చూపించారు. కాగా, వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన  ‘వకీల్‌ సాబ్‌’ చిత్రాన్ని వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజ్‌ నిర్మించారు. శ్రుతిహాసన్‌ కథానాయిక. నివేదా థామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు