Home సినిమాలు దుమ్మురేపుతున్న నాని 'టక్ జగదీష్' టీజర్..!

దుమ్మురేపుతున్న నాని ‘టక్ జగదీష్’ టీజర్..!

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్‌లు హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘టక్‌ జగదీశ్‌’.. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత హీరో నాని, డైరెక్టర్‌ శివ నిర్వాణ కాంబినేషన్‌లో అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందు‌తోంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ యూట్యూబ్ లో రికార్డు స్థాయి వ్యూస్ ను సాధిస్తున్నాయి.
తాజాగా ‘టక్ జగదీష్’ టీజర్ 16 మిలియన్ల వ్యూస్ ను దాటేసి… మరిన్ని వ్యూస్ ను రాబట్టే దిశగా పరుగులు పెడుతోంది. రాబోయే రోజుల్లో ఈ టీజర్ వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించేలా కనిపిస్తోంది. కాగా, షైన్‌ పిక్చర్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో పాటు రచన కూడా చేశారు శివ నిర్వాణ. నాజ‌ర్, జ‌గ‌ప‌తి బాబు, రావు ర‌మేష్‌, వీకే న‌రేష్‌, డానియ‌ల్ బాలాజీ, తిరువీర్, రోహిణి, దేవ‌ద‌ర్శిని, ప్రవీణ్ ముఖ్య పాత్రలు పోషించారు. వాస్తవంగా ఏప్రిల్‌ 23వ తేదీన ఈ చిత్రాం విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా  వాయిదా పడింది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు