Home ప్రత్యేకం దుమ్మురేపుతున్న "ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు" న్యూ ప్రోమో

దుమ్మురేపుతున్న “ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు” న్యూ ప్రోమో

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై మెరవబోతున్న విషయం తెలిసిందే. జెమిని టీవీలో ప్రసారం కానున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ప్రోమో విడుదలైంది. ఇటీవల ఎన్టీఆర్ ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. మే మొదటి వారం నుంచి ఈ షో ప్రసారమవుతుందని అనుకుంటున్నారు. బిగ్ బాస్ షోను సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ చేసిన తరవాత ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న షో కావడంతో దీనిపై అందరికీ ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రియాలిటీ షోకి సంబంధించిన ఎన్టీఆర్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు.

ఎన్టీఆర్ వాక్చాతుర్యం బుల్లితెర ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుందో ఈ ప్రోమోలను చూస్తుంటేనే అర్ధ‌మ‌వుతుంది. “ఇక్కడ కథ మీది.. కల మీది.. ఆట నాది.. కోటి మీది” అంటూ యంగ్ టైగర్ చెబుతున్న మాట‌లు షో పట్ల ఉన్న ఆసక్తిని రెట్టింపు చేశాయి. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ త్వ‌ర‌లో త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు