Home సినిమాలు దీని కోసం పదేళ్లు ఎదురుచూశా.. చిన్న ‌పిల్లాడిలా ఏడ్చిన‌ అల్ల‌రి న‌రేష్‌..

దీని కోసం పదేళ్లు ఎదురుచూశా.. చిన్న ‌పిల్లాడిలా ఏడ్చిన‌ అల్ల‌రి న‌రేష్‌..

అల్ల‌రి సినిమాను త‌న ఇంటి పేరుగా మార్చుకున్న విల‌క్ష‌ణ న‌టుడు అల్ల‌రి న‌రేష్‌. గతంలో వరుస కామెడీ చిత్రాలతో హిట్లు కొట్టిన నరేశ్‌ గత కొన్నేళ్లుగా ప్లాప్‌లతో సతమతమవుతున్నాడు. దీంతో తన కామెడీ ఇమేజ్‌ని పక్కన పెట్టి ప్రయోగంగా ‘నాంది’ సినిమా చేశాడు. శుక్రవారం(ఫిబ్రవరి 19) విడుదలైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ని సొంతం చేసుకుంది. విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటుంది. ముఖ్యంగా అల్ల‌రి న‌రేష్ న‌ట‌న‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తుంది. 

అయితే, ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విజయోత్సవం నిర్వహించారు చిత్రయూనిట్ సభ్యులు. ఈ కార్యక్రమంలో అల్లరి నరేష్ ఎమోషనల్ అయ్యారు. గత కొన్నేళ్లుగా సక్సెస్ చూడని నరేష్ ఈ ‘నాంది’ సినిమాతో తిరిగి ట్రాక్ ఎక్కారు. ఇదే విషయాన్ని గుర్తుచేసుకుంటూ అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు అల్లరి నరేష్. నాంది సినిమాలో తండ్రిగా నటించిన దర్శకుడు, నటుడు దేవిప్రసాద్‌ని హత్తుకొని ఏడ్చేశారు. 2012 ఆగస్టులో ‘సుడిగాడు’ హిట్ తర్వాత తన కెరీర్‌లో పెద్ద విజయాన్ని అందుకున్న సినిమా నాంది అని, ఈ విజయం కోసం ఎనిమిదేళ్ల పాటు ఎదురుచూశానని నరేష్ అన్నారు.

అయితే, వరుసగా ఎనిమిదేళ్లు పరాజయాల్లో ఉన్నా కూడా తనకు ధైర్యం చెబుతూ ఓ మంచి సినిమా చేద్దామని సతీష్‌ వేగేశ్న ప్రోత్సహించారని, తన రెండో ఇన్నింగ్స్‌కి ‘నాంది’తో దర్శకుడు విజయ్‌ కనకమేడల పునాది వేశారని తెలుపుతూ నరేష్ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు