Home క్రీడలు దక్షిణ ఆఫ్రికా లెజెండ్స్ పై ఇండియా లెజెండ్స్ ఘన విజయం

దక్షిణ ఆఫ్రికా లెజెండ్స్ పై ఇండియా లెజెండ్స్ ఘన విజయం

రహదారి భద్రతా ప్రపంచ సిరీస్ లో భాగం గా ఇండియా లెజెండ్స్ దక్షిణ ఆఫ్రికా లెజెండ్స్ జట్ల మధ్య జరిగిన టి 20 మ్యాచ్ లో ఇండియా లెజెండ్స్ దక్షిణ ఆఫ్రికా లెజెండ్స్ పై 56 పరుగుల తేడా తో విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్ల లో 3 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోరును చేసింది.  మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 37 బంతుల్లో 60 పరుగులు చేసి అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు.  సచిన్ కి అండగా నిలిచిన బద్రీనాథ్ 42 పరుగులు చేశాడు.

ఆ తరవాత వచ్చిన యువరాజ్ సింగ్ శివాలెత్తిపోయాడు.  కేవలం 22 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు.  యూసఫ్ పఠాన్, గోని కూడా బాట్ ఝుళిపించారు.   యూసఫ్ పఠాన్ 10 బంతుల్లోనే 23 పరుగులు, గోని 9 బంతుల్లోనే 16 పరుగులు చేశారు.

అనంతరం 205 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణ ఆఫ్రికా లెజెండ్స్ కు ఓపెనర్స్ పుట్టిక్ (41), వాన్ విక్ (48) మంచి ఆరంభాన్ని ఇచ్చారు.  అయితే ఆతర్వాత వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది.  నిర్ణీత 20 ఓవర్ లు ముగిసే సరికి దక్షిణ ఆఫ్రికా లెజెండ్స్ ఏడు వికెట్ల నష్టానికి 148 పరుగులు మాత్రమే చేసింది.  ఇండియా లెజెండ్స్ లో యూసఫ్ పఠాన్ 3 వికెట్లు, యువరాజ్ 2 వికెట్లు తీసుకోగా ఓజా, వినయ్ లు చెరో వికెట్ తీశారు. 

ఇండియా లెజెండ్స్, శ్రీ లంక లెజెండ్స్ ఇప్పటికే సెమి ఫైనల్ కి  అర్హత సాధించారు.  మిగతా రెండు బెర్త్ లు ఖరారు కావాల్సి ఉంది

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు