Home సినిమాలు ‘థాంక్యూ’ మూవీ క్రేజీ అప్‌డేట్: నాగ చైతన్య సరసన ముగ్గురు హీరోయిన్స్ వీరే!

‘థాంక్యూ’ మూవీ క్రేజీ అప్‌డేట్: నాగ చైతన్య సరసన ముగ్గురు హీరోయిన్స్ వీరే!

అక్కినేని యంగ్‌ హీరో నాగచైతన్య వరుస సినిమాలతో బిజీగాఉన్నాడు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ‘లవ్‌స్టోరీ’షూటింగ్‌ పూర్తి చేసుకున్న చైతూ.. ప్రస్తుతం  విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో ‘థాంక్యూ’ సినిమా చేస్తూన్నాడు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్‌ ప్రస్తుతం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. థాంక్యూ సినిమాలో నాగచైతన్యతో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇప్పటికే ఈ సినిమాలో చైతు సరసన రాశి ఖన్నా ఫిక్స్ అయిందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ‘థాంక్యూ’లో మరో ఇద్దరు హీరోయిన్స్ నటించిబోతున్నారు. టాలెంటెడ్ యంగ్ బ్యూటీస్ మాళవిక నాయర్, అవికా గోర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించనున్నట్లు తాజా సమాచారం. కాగా, విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో వస్తున్న థాంక్యూ ఒక కమర్శియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. దీన్ని దిల్‌ రాజు తన బ్యానర్‌ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. ఇది 2021 చివర్లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు చిత్రబృందం. ప్రస్తుతం నాగచైతన్య సాయి పల్లవితో కలిసి లవ్‌స్టోరీ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌ 16న విడుదల కానుంది.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు