Home టీవీ త్వరలో మీలో ఎవరు కోటీశ్వరుడు - సీజన్ 5 తారక్ తో

త్వరలో మీలో ఎవరు కోటీశ్వరుడు – సీజన్ 5 తారక్ తో

స్టార్ మా బిగ్ బాస్ – సీజన్ 1 విజయవంతం కావడం లో హోస్ట్ గా తారక్ షో ని అద్భుతం గా నడిపించారు.  ఒక పక్క ఆర్ ఆర్ ఆర్, త్రివిక్రమ్ సినిమాల తో బిజీ గా ఉన్నా, ఇప్పుడు మళ్ళీ మరో సారీ బుల్లి తెర ప్రేక్షకులను ఉర్రూతలూగించడానికి వస్తున్నారు.  ఆ షో “మీలో ఎవరు కోటీశ్వరుడు”.  ఈ షో టీజర్ ని అన్నపూర్ణ స్టూడియో లో, త్రివిక్రమ్ దర్శకత్వం లో చిత్రీకరించారని సమాచారం.

అయితే ఈ సారి “మీలో ఎవరు కోటీశ్వరుడు” స్టార్ మా లో కాకుండా జెమినీ లో ప్రసార అవుతుందని ఒక సమాచారం. షో ని ప్రేక్షకులకు మరింత దగ్గరకు తీసుకు వెళ్ళడానికి కొన్ని మార్పులు చేస్తారట.  ఈ షో ని గతం లో మొదటి మూడు సీజన్లను నాగార్జున నడిపిస్తే, నాలుగవ సీజన్ మెగాస్టార్ చిరంజీవి నడిపించారు. 

ఈటీవీ కి జబర్దస్త్ ఉంది, స్టార్ మా కి బిగ్ బాస్ ఉంది, జీ తెలుగు ఇలాంటి షో ల జోలికి పోదు. ఇప్పుడు జెమినీ టీవీ కి ఒక గేమ్ చేంజెర్ షో  అవసరమని తెలుస్తోంది.  అయితే ఒక విషయం ఆలోచించాలి ఇక్కడ.   మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ల వారి రేటింగ్స్ తగ్గుతూ వచ్చాయి. అందుకే స్టార్ మా దీనిని వదిలేసి బిగ్ బాస్ తెచ్చింది. మరి ఇప్పుడు సీజన్ 5 ఎంత వరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

అయితే ఈ షో ఎప్పుడు లాంచ్ చేస్తారు, ఎన్నింటికి ప్రసారం చేస్తారో మరియు నిర్దిష్టం గా ఏ ఛానల్ లో ప్రసారం చేస్తారో తెలియాల్సి ఉంది. 

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు