Home ప్రత్యేకం తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయబోతున్న పవన్ కళ్యాణ్.. ఫ్యాన్స్ కు పండగే..!

తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయబోతున్న పవన్ కళ్యాణ్.. ఫ్యాన్స్ కు పండగే..!

‘గద్దలకొండ గణేష్‌’తో భారీ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు స్టార్ డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌. ఇటీవల ఆయన పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌‌తో ఓ చిత్రం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. హరీశ్‌ దర్శకత్వంలో వస్తున్న పవన్‌ 28వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ఇప్పటికే కథ, స్క్రిప్ట్‌ను సిద్దం చేసిన దర్శకబృందం ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతోంది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు వేగంగా జ‌రుగుతున్నాయి. అక్టోబ‌ర్‌లో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచ‌న‌లో చిత్ర యూనిట్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

అయితే  తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప‌వ‌న్ కళ్యణ్ ఈ సినిమాలో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయనున్న‌ట్టు సమాచారం. పవన్ పోషించే పాత్రల్లో  ఓ పాత్ర తండ్రిది కాగా, మ‌రొక పాత్ర కొడుకుడి అని తెలుస్తోంది. కాగా దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇప్పటికే పవన్‌కల్యాణ్‌-హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్‌సింగ్‌’ సినిమా బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో త్వరలో ప్రారంభం కాబోయే ఈ సినిమాపై పవర్‌స్టార్‌ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

 

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు