Home సినిమాలు తెలంగాణలో థియేటర్లు బంద్‌.. ఒక్క 'వకీల్ సాబ్' మాత్రమే!

తెలంగాణలో థియేటర్లు బంద్‌.. ఒక్క ‘వకీల్ సాబ్’ మాత్రమే!

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభన కారణంగా థియేటర్లు మరోసారి మూతపడనున్నాయి. విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 21 నుంచి 30వ తేది వరకూ సినిమా హాళ్లు మూసివేస్తున్నట్లు తెలంగాణ థియేటర్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ నిర్ణయించుకుంది. ఈ మేరకు కార్యదర్శి విజేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం అసోసియేషన్‌ సభ్యులు సమావేశమయ్యారు. కరోనా  ఉద్ధృతి, ప్రేక్షకుల ఆరోగ్యం దృష్ట్యా థియేటర్లు, మల్టీఫ్లెక్స్ లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్  వెల్లడించింది.

నిజానికి ఈ వారం వేరే పెద్ద సినిమాల విడుదలలు లేవు. దీంతో ఈ నెలాఖరు వరకు సినిమా హాళ్లను మూసేయాలని నిర్ణయించారు. కానీ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ప్రదర్శించే కొన్ని థియేటర్లకు మాత్రం మినహాయింపును ఇచ్చారు. అవి మాత్రం రోజుకు మూడు షోల చొప్పున నడవనున్నాయి. అది కూడ ఈ వారాంతం వరకు మాత్రమే. ఆ తర్వాత అవి కూడ క్లోజ్ అవనున్నాయి.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు