Home ప్రత్యేకం తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మే 1 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు ప్రకటించింది.ఏప్రిల్‌ 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష,  ఏప్రిల్‌ 3న  ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్‌ పరీక్షలు, ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఉంటాయని  ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. అలాగే పదో తరగతి పరీక్షలు మే 17 నుంచి నిర్వహించే అవకాశం ఉంది.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు తెరుచుకోనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇంటర్మీడియట్‌ తరగతుల ప్రారంభానికి అధికారులు సన్నద్ధం అవుతున్నారు. విడతల వారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో 9, 10 తరగతులను నిర్వహించాలని నిర్ణయించగా ఇంటర్మీడియల్‌లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. కరోనా నిబంధనల మేరకు ఒక రోజు మొదటి సంవత్సరం, మరో రోజు రెండో సంవత్సరం తరగతులు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలవడానికి వీలులేకుండా వారంలో మూడు రోజులు మొదటి, మరో మూడు రోజులు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు నిర్వహించనున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు