Home క్రీడలు డ‌బ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌: రెండోస్థానానికి దూసుకెళ్లిన భారత్.. ఫైనల్ ఆశలు సజీవం!

డ‌బ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌: రెండోస్థానానికి దూసుకెళ్లిన భారత్.. ఫైనల్ ఆశలు సజీవం!

చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో అద్భుత విజయం సాధించిన టీమిండియా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లింది. తొలి టెస్టులో విజయం తర్వాత అనూహ్యంగా పాయింట్ల పట్టికలో పైకి దూసుకెళ్లిన ఇంగ్లండ్‌ జట్టు తాజా ఓటమితో నాలుగో స్థానానికి దిగజారింది. టీమిండియా మాత్రం ఇంగ్లీష్ జట్టుపై సాదించిన విజయంతో నాలుగు నుంచి రెండో స్థానానికి దూసుకెళ్లింది. కాగా, జూన్‌లో లార్డ్స్‌ వేదికగా వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుండగా.. ఫైనల్‌కు ఎవరు అర్హత సాధిస్తారనేది మాత్రం మూడో టెస్టు తర్వాతే తేలనుంది.

అయితే, అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న మూడో టెస్టులో​ టీమిండియా విజయం సాధిస్తే 2-1 తేడాతో లేకుండా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అలా కాకుండా ఇంగ్లండ్‌ జట్టు విజయం సాధిస్తే మాత్రం నాలుగో టెస్టులోనూ కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఇలా కాకుండా భారత్, ఇంగ్లాండ్ సిరీస్ డ్రా అయితే ఈ రెండు జట్లు కాకుండా ఆస్ట్రేలియా ఫైన‌ల్‌కు వెళ్తుంది. ఈ ఈక్వేష‌న్ల‌తో ఐసీసీ తొలిసారిగా ప్ర‌వేశ‌పెట్టిన వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ రేసు చాలా ఆస‌క్తిక‌రంగా మారింది. కాగా, టీమిండియాకు ప్రస్తుతం 69.7 పీసీటీ పాయింట్లు ఉండగా.. ఇంగ్లండ్‌కు 67 పీసీటీ పాయింట్లు ఉన్నాయి. ఇప్పటికే 70 పీసీటీ పాయింట్లతో న్యూజిలాండ్ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు