Home సినిమాలు ట్రైలర్ రివ్యూ.. ఉత్కంఠ రేపుతోన్న ‘పవర్‌ ప్లే’ట్రైలర్‌!

ట్రైలర్ రివ్యూ.. ఉత్కంఠ రేపుతోన్న ‘పవర్‌ ప్లే’ట్రైలర్‌!

యువనటుడు రాజ్‌తరుణ్‌ హీరోగా, విజయకుమార్‌ కొండా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘పవర్‌ ప్లే’. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలయ్యింది.‘ఎవడ్రా నువ్వు.. నన్ను రోడ్డు మీదకు లాగేశావ్‌’ అంటూ రాజ్‌తరుణ్‌ చెప్పే డైలాగ్‌తో కథలో ఎన్ని మలుపులు ఉంటాయో అర్థమౌతోంది. నటి పూర్ణ ఒక కీలకపాత్రలో కనిపిస్తుండటం విశేషం. 

మధునందన్‌, అజయ్‌, రాజారవీంద్ర వంటి ప్రముఖ నటులు ఇందులో నటిస్తున్నారు. చూస్తుంటే ఇదేదో సస్పెన్స్‌ థ్రిల్లర్‌లా అనిపిస్తోంది. సురేష్‌ బొబ్బిలి అందించిన బ్యాక్‌గ్రౌండ్ ‌స్కోర్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రాన్ని మనమాలి క్రియేషన్స్‌పై మహిథర్‌, దేవేష్‌ నిర్మిస్తున్నారు. హేమల్‌ కథానాయికగా నటిస్తోంది. వనమాలి ప్రొడక్షన్‌ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్‌కుమార్‌ కొండా, రాజ్‌తరుణ్ కాంబినేషన్లో గతంలో ‘ఒరేయ్‌ బుజ్జిగా’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఆసక్తికరంగా ఉన్న ‘పవర్‌ ప్లే’ ట్రైలర్‌ను మీరు చూసేయండి!

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు