Home సినిమాలు ట్రైలర్ టాక్: ‘జాతిరత్నాలు’ ట్రైలర్ చూస్తే నవ్వి నవ్వి చావాల్సిందే

ట్రైలర్ టాక్: ‘జాతిరత్నాలు’ ట్రైలర్ చూస్తే నవ్వి నవ్వి చావాల్సిందే

వీన్‌ పోలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జాతి రత్నాలు’. అనుదీప్‌ దర్శకుడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ముగ్గురు యువకుల జీవితంలో ‘లైఫ్‌ అండ్‌ డెత్‌’ పరిస్థితి ఏర్పడటానికి కారణం ఏంటి? దాన్ని వాళ్లు ఎలా ఎదుర్కొన్నారు? చివరకు ఆ సమస్య నుంచి బయట పడ్డారా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అప్పటివరకూ ఆసక్తికరంగా, నవ్వులు పంచుతూ సాగిన ఈ ట్రైలర్ మీరూ చూసేయండి. 

కాగా మహానటి లాంటి బ్లాక్‌ బస్టర్ సినిమా తరువాత స్వప్న సినిమా బ్యానర్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాతీయ అవార్డు సాధించిన దర్శకుడు నాగ అశ్విన్‌ ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నాడు. రాధన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. మార్చి 11న ‘జాతి రత్నాలు’ ప్రేక్షకుల ముందుకు రానుంది.‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో సినిమాతో హిట్టు కొట్టి నవీన్‌ పోలిశెట్టి ప్రతిభగల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు తోడు ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణతోడవడంతో ఏ రేంజ్‌లో హాస్యం ఉంటుందో ఊహించుకోవచ్చు!

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు