Home ప్రత్యేకం టాలీవుడ్ ఊపిరి పీల్చుకో.. మన 'పుష్పరాజ్‌' ఏడో తేదీన వచ్చేస్తున్నాడు!

టాలీవుడ్ ఊపిరి పీల్చుకో.. మన ‘పుష్పరాజ్‌’ ఏడో తేదీన వచ్చేస్తున్నాడు!

అల్లుఅర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బన్నీ ‘పుష్పరాజ్‌’గా కనిపించనున్న విషయం తెలిసిందే. కాగా, శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో బన్నీ మాస్‌, రఫ్‌ లుక్‌లో విభిన్నంగా కనిపించనున్నారు. అంతేకాకుండా ‘పుష్ప’ కోసం ఆయన చిత్తూరు మాండలికాన్ని నేర్చుకున్నారు. రష్మిక కథానాయిక. మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై ఈ చిత్రం నిర్మితమవుతోంది.
అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌‌, రిలీజ్‌ డేట్‌ పోస్టర్లను తప్ప ఈ ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్స్‌ను మేకర్స్ రిలీజ్ చేయలేదు. అయితే, ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఓ క్రేజీ అప్‌డేట్‌ను చిత్రయూనిట్ తాజాగా అభిమానులతో పంచుకుంది. ఈ మేరకు ఏప్రిల్‌ 7న సాయంత్రం 6.12 గంటలకు పుష్పరాజ్‌ను విజువల్‌గా పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. కాగా, దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు