Home సినిమాలు టక్ జగదీష్’ స్పెషల్ సర్‌ప్రైజ్.. సేవ్ ది డేట్ అంటూ నాని ప్రకటన

టక్ జగదీష్’ స్పెషల్ సర్‌ప్రైజ్.. సేవ్ ది డేట్ అంటూ నాని ప్రకటన

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ ద‌ర్శక‌త్వంలో వస్తోన్న చిత్రం ‘ట‌క్ జ‌గ‌దీష్’. ఈ సినిమా షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉంది. ఈ చిత్రంలో రీతు వ‌ర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నాని న‌టిస్తోన్న ఈ  చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు

కాగా..నాని ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ అప్‌డేట్ రానే వ‌చ్చింది. నాని మ్యూజిక‌ల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఫిబ్ర‌వ‌రి 13 నుంచి మొద‌లు కానుంది. థ‌మ‌న్ కంపోజ్ చేసిన తొలి లిరిక‌ల్ వీడియో సాంగ్ “ఇంకోసారి ఇంకోసారి..” ఫిబ్ర‌వరి 13న లాంఛ్ కానుంది. బ్లూ టీష‌ర్టు-వైట్ జీన్ ప్యాంట్ లుక్ లో ఉన్న నాని  అంద‌మైన ప్ర‌దేశంలోబండ‌రాయిపై కూర్చొని నీలిరంగు డిజైన్‌డ్ పంజాబీ డ్రెస్ లో మెరిసిపోతున్న రీతూవ‌ర్మ చేయి ప‌ట్టుకుని ప్ర‌పోజ్ చేస్తున్న‌ట్టుగా ఉన్న స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..నాని-రీతూ ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తున్న ఈ స్టిల్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. సాంగ్ పోస్ట‌ర్ చూస్తుంటే నాని-రీతూ కాంబినేష‌న్ లోని ఈ పాట సంగీత అభిమానుల్ని ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇదిలావుండగా..నాని హీరోగా న‌టించిన హిట్ మూవీ ‘నిన్నుకోరి’తో ప‌రిచ‌య‌మై.. రెండో సినిమా ‘మ‌జిలీ’తోనూ సూప‌ర్ హిట్ సాధించిన శివ నిర్వాణ ద‌ర్శక‌త్వం వ‌హిస్తుండ‌టంతో ‘ట‌క్ జ‌గ‌దీష్‌’పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. టైటిల్‌తోటే ఆస‌క్తిని రేకెత్తిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇదివ‌ర‌కు విడుద‌ల చేసిన ఫస్ట్ లుక్ ఫ్యాన్స్‌ను బాగా ఆక‌ట్టుకుంది. సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌. త‌మ‌న్ స్వరాలు కూరుస్తున్న ఈ సినిమాకు ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్. వెంకట్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు, రావు ర‌మేష్‌, న‌రేష్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు