Home సినిమాలు జోరు మీదున్న రామ్.. యంగ్ డైరెక్ట‌ర్‌తో క్రేజీ మూవీ ఫిక్స్!

జోరు మీదున్న రామ్.. యంగ్ డైరెక్ట‌ర్‌తో క్రేజీ మూవీ ఫిక్స్!

ఈ ఏడాది ఆరంభంలో ‘హిట్’ సినిమాతో భారీ హిట్ అందుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇటీవలే తమిళ దర్శకుడు లింగుస్వామితో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. హీరో రామ్ కెరీర్‌లో 19వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా అనంతరం యువ దర్శకుడు అనిల్ రావిపూడితో రామ్ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా, అనిల్ రావిపూడి-రామ్ పోతినేని కాంబోలో ఓ సినిమా రానుందని.. ఇప్పటికే వీరిద్దరూ కథ విషయమై సంప్రదింపులు కూడా జరిపారని తెలుస్తోంది.
దాంతో వచ్చే ఏడాది దాదాపు వీరి కాంబోలో  సినిమా రావడం ఖాయంగా కనిపిస్తోంది. అనిల్ ఇప్పటికే ఇటీవల రామ్‌కు కథ వినిపించగా.. అతను ఓకే చెప్పినట్లు కూడా సమాచారం. నిజానికి రవితేజ హీరోగా అనిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజా ది గ్రేట్’ సినిమాని ముందు రామ్‌తోనే అనుకున్నారట. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు. అయితే ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఈసారి అనిల్ దర్శకత్వంలో నటించే అవకాశాన్ని వదులుకోవద్దని రామ్ ఫిక్స్ అయ్యాడట. దీంతో అనిల్ ‘ఎఫ్3’ సినిమా పూర్తి కాగానే.. రామ్-అనిల్ కాంబినేషన్‌లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు