Home చదువు జేఈఈ మెయిన్‌ 2021 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

జేఈఈ మెయిన్‌ 2021 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐలలో ప్రవేశాల కోసం ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు నిర్వహించిన తొలి విడత జేఈఈ మెయిన్‌ ఫలితాలు జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) తాజాగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 6.61 లక్షల మంది జేఈఈ మెయిన్‌-2021కు హాజరయ్యారు. ఇందులో 6.20 లక్షల మంది వరకు పేపర్‌-1 రాశారు. తెలుగు రాష్ట్రాల్లో లక్షన్నర మంది ఉన్నారు.ఈసారి జేఈఈ మెయిన్‌ -2021 క్వాలిఫై అయిన విద్యార్థులు మార్కులతో సంబంధం లేకుండా క్లాస్‌ 12 ఉత్తీర్ణులైన ధ్రువీకరణ పత్రం ఉంటే సరిపోతుంది. కరోనా  కారణంగా కేవలం 2021-2022 సంవత్సరానికే ఇది వర్తిస్తుందనిఎన్‌టీఏ తెలిపింది.

కాగా.. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈసారి 4 విడతల్లో జేఈఈ మెయిన్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో తొలుత జరగ్గా.. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కూడా నిర్వహించనున్నారు. నాలుగింటిలో ఎందులో ఎక్కువ స్కోర్‌ వస్తే దానినే పరిగణనలోకి తీసుకొని తుది ర్యాంకు ఖరారు చేస్తామని ఎన్‌టీఏ వెల్లడించింది. ఇక జేఈఈ మెయిన్ పరీక్ష రాసిన అభ్యర్థులు జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

ఇందుకోసం జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌ ఉంది. https://jeemain.nta.nic.in ఇందులో ఫలితాలు చూసుకొని…ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు