Home సినిమాలు జులై నుండి నాగార్జున క్రేజీ సీక్వెల్ 'బంగార్రాజు' ప్రారంభం!

జులై నుండి నాగార్జున క్రేజీ సీక్వెల్ ‘బంగార్రాజు’ ప్రారంభం!

నాగార్జున హీరోగా కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ (2016) చిత్రం సూపర్‌హిట్‌ సాధించింది. ఈ సినిమాలో నాగార్జున పోషించిన బంగార్రాజు క్యారెక్టర్‌ ఆడియన్స్‌ను బాగా మెప్పించింది. దీంతో నాగ్, కల్యాణ్‌ కలిసి ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ సినిమా చేయనున్నారు. అయితే అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న బంగార్రాజు సినిమా జూలైలో సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని తెలుస్తోంది.
తాజాగా బంగార్రాజు సినిమా జూలై రెండో వారం నుండి ప్రారంభం కానుంద‌ని, ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ పనులు వేగంగా జ‌రుగుతున్నాయ‌ని నాగార్జున ఓ ఇంట‌ర్వ్యూలో వెల్లడించారు. అలాగే తొలి పార్ట్‌లో నాగార్జునకు జోడీగా నటించిన ర‌మ్య‌కృష్ణ రెండో బాగంలోను న‌టిస్తుంది. అలాగే నాగ చైత‌న్య కూడా ఇందులో ముఖ్య పాత్ర పోషించ‌నున్న‌ట్టు సమాచారం.
ఇక మరోవైపు  నాగార్జున హీరోగా, బాలీవుడ్‌ నటి దియా మీర్జా హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’. ఈ చిత్రంతో అహిషోర్‌ సాల్మోన్‌ దర్శకుడిగా పరిచయమయ్యారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం మార్చి 2న విడుదలై పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. దీంతో ఈ చిత్రం విడుదలైన 19 రోజుల్లోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యింది. అయితే కలెక్షన్ల పరంగా నిరాశపరచిన ‘వైల్డ్‌ డాగ్’‌ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ఆదరగొడుతోంది. వ్యూస్‌ పరంగా రికార్డులు క్రియేట్‌ చేస్తూ దూసుకుపోతోంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు