Home ప్రత్యేకం జాతీయ ఉత్తమ చిత్రం విడుదల కాలేదు.. అయినా అవార్డు ఎలా?

జాతీయ ఉత్తమ చిత్రం విడుదల కాలేదు.. అయినా అవార్డు ఎలా?

67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే.  వీటిలో తెలుగు‌, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌కు చెందిన ప‌లు సినిమాలు స‌త్తా చాటాయి. తెలుగు సినిమాకు నాలుగు అవార్డులు ద‌క్క‌గా, ఇందులో బెస్ట్‌ పాపులర్‌ ఫిల్మ్‌గా మహేశ్‌ బాబు నటించిన ‘మహర్షి’ ఎంపికైంది.ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నాని నటించిన ‘జెర్సీ’ కిఅవార్డ్ ద‌క్కింది. ఇక మహర్షి’ చిత్రానికి నృత్యాలు సమకూర్చిన రాజు సుందరం ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా, ‘జెర్సీ’కి ఎడిటింగ్‌ చేసిన నవీన్‌ నూలి ఉత్తమ ఎడిటర్‌గా జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో  మోహన్‌లాల్‌ నటించిన మరక్కార్‌ మళయాళ చిత్రానికి గాను ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌, స్పెషల్‌ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్స్ కేటగిరీల్లో  అవార్డు లభించింది

ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే.. ఈ చిత్రం ఇంకా విడుదల‌ అవ్వలేదు. రిలీజ్ కాకముందే అవార్డును ఎలా ప్రకటించారని అందరు ఆశ్చర్యపోయారు. వాస్తవానికి, గతేడాది మార్చి 26న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. లాక్‌డౌన్‌ వల్ల కుదరలేదు. దేశవ్యాప్తంగా ఈ మే 13న విడుదల చేయనున్నట్టు ఫిబ్రవరిలో మోహన్‌లాల్‌ ప్రకటించారు. 2020 డిసెంబర్‌ 31లోపు సినిమా సెన్సార్‌ పూర్తవడంతో ఆ ఏడాది సినిమా కింద పరిగణించి అవార్డులు ఇచ్చారు.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు