Home సినిమాలు జాతీయ అవార్డులు: జెర్సీకి ఇక అవార్డ్స్‌ వచ్చే ఛాన్స్ లేదు అనుకున్నాం.. నాని ఎమోషనల్!

జాతీయ అవార్డులు: జెర్సీకి ఇక అవార్డ్స్‌ వచ్చే ఛాన్స్ లేదు అనుకున్నాం.. నాని ఎమోషనల్!

జాతీయ సినిమా అవార్డుల్లో తెలుగు పరిశ్రమకు చెందిన రెండు సినిమాలు సత్తా చాటిన్ విషయం తెలిసిందే. తాజాగా ప్రకటించిన అవార్డుల్లో టాలీవుడ్ కు సంబంధించి మొత్తం ఐదు అవార్డులు వచ్చాయి. ఇక ఉత్తమ తెలుగు చిత్రంగా నాని హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘జెర్సీ’ ఎంపికైంది. దీంతోపాటు ఉత్తమ ఎడిటర్‌గా నవీన్‌ నూలి జాతీయ అవార్డు దక్కించుకున్నారు. ఈ అవార్డు దక్కడంపై చిత్రయూనిట్‌ హర్షం వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో తన సినిమా జాతీయ చలన చిత్ర అవార్డు గెలుచుకోవడం పట్ల నాని స్పందించారు. ‘జెర్సీ’ చిత్రానికి రెండు కేటగిరీల్లో జాతీయ అవార్డు రావడం చాలా సంతోషాన్నిచ్చిందని పేర్కొంటూ ఓ వీడియో సందేశమిచ్చారు. ఈ వీడియోలో నాని మాట్లాడుతూ.. ”ఇటీవలే నేను, గౌతమ్‌ ఒకసారి కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకున్నాం. గతేడాది కరోనా మహమ్మారి విజృంభించడంతో ‌అవార్డ్స్ ఫంక్షన్స్ లేవు. కాబట్టి.. జెర్సీకి ఇక అవార్డ్స్‌ వచ్చే అవకాశం లేదు అనుకున్నాం. కానీ ఇప్పుడు నేషనల్‌ అవార్డ్స్‌ ప్రకటించారు. జెర్సీ సినిమాకు రెండు అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉంది.అలాగే మీతో ఈ విషయాన్నీ పంచుకోవడం  ఇంకా సంతోషంగా అనిపిస్తోంది అని నాని పేర్కొన్నాడు.

అత్యంత ప్రముఖమైనవి

యంగ్ టైగర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అర‌వింద స‌మేత త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశ‌లు...

‘వకీల్ సాబ్’లో పవన్ తెలంగాణ యాసలోనే ఎందుకు మాట్లాడతాడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని...

‘వకీల్‌సాబ్‌’లో పవన్ అసలు నటించనేలేదు.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్‌కళ్యాణ్‌ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వకీల్‌సాబ్‌' ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ నటనను చూసి ప్రేక్షకాభిమానులే కాదు, మెగాస్టార్‌ చిరంజీవితో...

ఉగాది రోజు బాల‌య్య-బోయపాటి సినిమా నుండి స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

ఇటీవలి వ్యాఖ్యలు