Home సినిమాలు ‘జాతి రత్నాలు’ అభిమానులకు అదిరిపోయే శుభవార్త

‘జాతి రత్నాలు’ అభిమానులకు అదిరిపోయే శుభవార్త

జాతి రత్నాలు సినిమా సక్సెస్‌ కావడంతో ఫుల్‌ హ్యాపీగా ఉందీ టీమ్‌. నవీన్ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం జాతి రత్నాలు. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర హిట్‌ టాక్‌ సొతం చేసుకుంది. హీరోల కామెడీకి థియేటర్‌లోకి వెళ్లిన ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుని బయటకు వస్తున్నారు. మొత్తానికి సినిమా సూపర్‌గా ఉందంటూ అంతటా పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుండటంతో జాతిరత్నాలు టీమ్‌ సంతోషంలో మునిగి తేలుతోంది. 

ఈ క్రమంలో తాజాగా చిత్రబృందం హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుక నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు డైరెక్టర్‌ అనుదీప్‌.. జాతిరత్నాలు సీక్వెల్‌పై వస్తోన్న వార్తలపై  స్పందించారు. తప్పకుండా జాతిరత్నాలు సీక్వెల్‌ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. ఈ సినిమాతో అనుదీప్‌ దర్శకుడిగా మంచి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదలకు ముందే అనుదీప్‌కు క్యాష్ ప్రోగ్రాం  ద్వారా మంచి ఫాలోయింగ్‌ వచ్చింది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు