Home సినిమాలు 'జాతిరత్నాలు' మూడు రోజుల కలెక్షన్స్: 'ఉప్పెన'తో పోటీ.. అరుదైన రికార్డ్స్ బ్రేక్

‘జాతిరత్నాలు’ మూడు రోజుల కలెక్షన్స్: ‘ఉప్పెన’తో పోటీ.. అరుదైన రికార్డ్స్ బ్రేక్

నవీన్ పొలిషెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన ఎంటర్‌టైనర్ `జాతి రత్నాలు` బాక్సాఫీస్ వద్ద  ఆధిపత్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌య‌ప‌రుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కలిపి 10.80 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా 11.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగి ఆ ఫీట్ అధిగమించింది. అంతేకాదు మెగా హీరో మూవీ ‘ఉప్పెన’తో పోటీపడుతూ సూపర్ హిట్ సినిమాల జాబితాలో నిలిచింది.

తొలి రెండు రోజులు వచ్చిన సక్సెస్ టాక్ తో మూడో రోజు  మంచి వసూళ్లు సాధించింది. మూడో రోజుకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.28 కోట్ల రూపాయలు వసూలు చేసింది ‘జాతి రత్నాలు’ మూవీ. దీంతో విడుదలైన మూడో రోజున ఎక్కువ వసూళ్లు చేసిన చిత్రాల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో తొలి స్థానంలో ‘ఉప్పెన’ (8.26 కోట్లు), ఇస్మార్ట్ శంకర్ (4.32 కోట్లు), భీష్మ (4.31 కోట్ల) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

అనుదీప్ కెవి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విదేశాలలో కూడా అసాధారణమైన వ్యాపారం చేస్తోంది. లాక్‌డౌన్ తర్వాత భారీ స్థాయిలో కలెక్షన్లు అందుకున్న తొలి సినిమాగా రికార్డు నమోదు చేసి ‘ఉప్పెన’ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టింది. మొత్తంగా చూస్తే ఈ మూడు రోజుల్లోనే 2.97 కోట్లు లాభాలను అందుకొని దుమ్మురేపారు ‘జాతరత్నాలు’

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు