Home సినిమాలు 'జాతిరత్నాలు’ ప్రీ రిలీజ్ బిజినెస్.. ఈ నవ్వులు రువ్వే రత్నాలు బాక్సాఫీస్ కొల్లగొడతారా?

‘జాతిరత్నాలు’ ప్రీ రిలీజ్ బిజినెస్.. ఈ నవ్వులు రువ్వే రత్నాలు బాక్సాఫీస్ కొల్లగొడతారా?

నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘జాతిరత్నాలు’. ఫరియా అబ్దుల్లా కథానాయిక. అనుదీప్‌.కె.వి దర్శకత్వం వహించారు. స్వప్న సినిమా పతాకంపై నాగ్‌ అశ్విన్‌ నిర్మించారు. ఈ నెల 11న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇక ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు హీరో నవీన్ పోలిశెట్టి. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఈ చిత్ర ట్రైలర్‌ని లాంఛ్‌కి మంచి హైప్ తీసుకుని రాగా.. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీంతో పాటు జాతి రత్నాలు ట్రైలర్, టీజర్, ప్రమోషనల్ పోస్టర్స్ సినిమా రేంజ్‌ని పెంచేశాయి. ఇక ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం దాదాపు రూ. 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది జాతి రత్నాలు. ఈ సినిమాపై ఉన్న హైప్.. అంచనాలు చూస్తుంటే పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా మూడు రోజుల్లోనే నిర్మాతలు సేఫ్ అయిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. గురువారం విడుదల కాబట్టి లాంగ్ వీకెండ్ కలిసి రానుంది. ముఖ్యంగా ఈ సినిమాపై ఓవర్సీస్‌లో భారీ హైప్ వచ్చేసింది. కాగా.. ఈ సినిమాలో జోగిపేట్‌ శ్రీకాంత్‌గా నవీన్‌ పొలిశెట్టి, శేఖర్‌గా ప్రియదర్శి, రవి పాత్రలో రాహుల్‌ రామకృష్ణ  నటించారు. ఈ చిత్రానికి సంగీతం: రధన్‌, ఛాయాగ్రహణం: సిద్ధం మనోహర్‌.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు