Home ప్రత్యేకం 'జాతిరత్నాలు' నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలు.. వామ్మో అన్ని కోట్లా..!

‘జాతిరత్నాలు’ నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలు.. వామ్మో అన్ని కోట్లా..!

ఇటీవల ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లైన చిత్రం ‘జాతిర‌త్నాలు’. న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఫ‌రీయా అబ్దుల్లా హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన ఈ చిత్రాన్ని అనుదీప్ కె.వి. ద‌ర్శ‌క‌త్వంలో స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ నిర్మించిన విష‌యం తెలిసిందే.. అండర్ డాగ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన  ఈ చిత్రం అనూహ్య విజ‌యాన్ని అందుకుని బాక్సఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కలుపుకుని రూ.10 కోట్లకు పైగా థియేట్రికల్‌ బిజినెస్‌ జరుపుకుంది. ఇక విడుదలైన తొలి రోజు నుంచే పాజిటీవ్ టాక్‌ రావడంతో  బాక్సాఫీస్‌ వద్ద పెను విధ్వంసం సృష్టించింది.

ఇక ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికొస్తే.. నైజాంలో రూ.16.18 కోట్లు, సీడెడ్‌లో రూ.4.10 కోట్లు, ఈస్ట్‌ గోదావరిలో రూ.1.92 కోట్లు, వెస్ట్‌ గోదావరిలో రూ.1.58 కోట్లు,  గుంటూరులో రూ.2.08 కోట్లు, కృష్ణాలో 1.81కోట్లు, నెల్లూరులో 92 లక్షల కలెక్షన్స్ రాబట్టింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం దాదాపు రూ. 32.59 కోట్లు షేర్‌, రూ.52 కోట్లకు పైగా గ్రాస్‌ వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.39.04 కోట్ల షేర్‌, రూ.70 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. దీంతో జాతిరత్నాలు నిర్మాతలకు రూ.27 కోట్లకు పైగా లాభాలు దక్కాయి.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు