Home సినిమాలు 'జాతిరత్నాలు’ క్లోజింగ్ కలెక్షన్స్.. నవీన్ పొలిశెట్టి ఆల్ టైమ్ రికార్డ్

‘జాతిరత్నాలు’ క్లోజింగ్ కలెక్షన్స్.. నవీన్ పొలిశెట్టి ఆల్ టైమ్ రికార్డ్

తెలుగు ఇండస్ట్రీకి మరో బ్లాక్ బస్టర్ వచ్చేసింది. శివరాత్రి కానుకగా విడుదలైన నవీన్ పొలిశెట్టి జాతి రత్నాలు సంచలన విజయం సాధించింది. స్వప్న సినిమా బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం భారీ హిట్ సాధించడంతో అటు చిత్రబృందం ఇటు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నటన ప్రేక్షకులను వినోదాల పల్లకిలో ఉరేగించింది.

ఇక కలెక్షన్ల విషయానికొస్తే.. ఈ సినిమా విడుదలకు ముందు 10.80కోట్ల బిజినెస్ చేసింది. విడుదలయ్యాక బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11.50 కోట్లుగా నిలిచింది. ఈ నేపథ్యంలో క్లోజింగ్ సమయానికి జాతిరత్నాలు సినిమా 38.52కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. మొత్తంగా బ్రేక్ ఈవెన్ కంటే 27కోట్లు లాభాలను ఈ సినిమా తెచ్చిపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా జాతిరత్నాలు 38.52 కోట్లు షేర్ వసూల్ చేసినప్పటికి 64.20 కోట్లు గ్రాస్ సెట్ చేసుకుంది. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే 32.52 కోట్లు షేర్ వసూల్ చేయడం విశేషం.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు