Home సినిమాలు 'చైతూతో గొడవలు'.. సంచలన విషయాలు బయటపెట్టేసిన సమంత!

‘చైతూతో గొడవలు’.. సంచలన విషయాలు బయటపెట్టేసిన సమంత!

ఏం మాయ చేసావే.. సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత తన సినిమాతోనే అందరినీ ఆకర్షించింది. తన చిలిపి నవ్వుతో అబ్బాయిల మనసుల్ని దోచేసింది. ఎంతోమందికి అభిమాన తారగా మారింది. అలా అందరి కళ్లు సమంత మీద ఉంటే ఆమె మాత్రం ఒకరి కోసం తపించింది. అతడెవరో కాదు అక్కినేని వారసుడు నాగచైతన్య. ఏమాయ చేసావే మూవీ.. వీరిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా వాళ్ల మనసులను మాయ చేసింది. దీంతో 2017లో మూడుముళ్ల బంధంతో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. పెళ్లయి నాలుగేళ్లవుతున్నా ఇప్పటికీ కొత్త జంటగానే అభిమానుల్ని అలరిస్తూ ఉంటారు.

అయితే తాజాగా ఓ షోలో అభిమానులతో ముచ్చటించిన సమంత తన వ్యక్తిగత జీవితం గురించి పలు  ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇక తన విషయానికి వస్తే నవ్వు, కళ్లు, తన శరీర బలం అంటే తనకు చాలా ఇష్టమని, ఈ మూడు లక్షణాలు తనకు బాగా నచ్చుతాయి అని సమంత వెల్లడించింది.
అలాగే తన భర్త నాగ చైతన్య గురించి మాట్లాడుతూ.. తమ ఇద్దరి మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతుంటాయని.. అయితే ప్రతిసారి మొదట సారీ చెప్పేది మాత్రం తానే అని బయటపెట్టేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే తెలుగులో గుణశేఖర్‌ దర్శకత్వంలో సమంత శాకుంతలం సినిమా చేస్తోండగా, నాగ చైనత్య థ్యాంక్యూ, లాల్‌ సింగ్‌ చద్దా సినిమాల్లో నటిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మహేశ్‌ Vs అర్జున్.. ‘సర్కారు వారి పాట’కి కొత్త తలనొప్పి.

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు...

రామ్ సినిమాలో ఆ సీనియర్ హీరో.. ‘రాపో 19’లో విలన్ గా కోలీవుడ్ సూపర్ స్టార్‌..

తనదైన శైలిలో అటు క్లాస్‌ ఇటు మాస్‌ ఆడియన్స్‌ను మెప్పించి టాలీవుడ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు రామ్‌ పోతినేని. ఆయన కథానాయకుడిగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రం ప్రకటించిన విషయం...

ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ రోల్ లీక్.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్

ప్ర‌ముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ‌లు...

నాన్న‌ను హ‌త్తుకుని నిద్ర‌పోతున్న సితార‌.. ఫోటో షేర్‌ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే...

ఇటీవలి వ్యాఖ్యలు