Home సినిమాలు 'చెక్’ టీమ్‌కి ఎన్టీఆర్ సర్‌ప్రైజ్‌!

‘చెక్’ టీమ్‌కి ఎన్టీఆర్ సర్‌ప్రైజ్‌!

గతేడాది ‘భీష్మ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో నితిన్.. ఈ ఏడాది ‘చెక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో నితిన్ ఖైదీగా కనిపించనున్నారు. నితిన్ సరసన ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్‌గా నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ కీలకమైన లాయర్ పాత్రను పోషించారు. కళ్యాణి మాలిక్ సంగీతం సమకూరుస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ఈనెల 26న విడుదల చేస్తున్నారు.

కాగా, చిత్రబృందం కూడా గతకొన్ని రోజులుగా సినిమాని ప్రేక్షకులలోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్‌ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌, ఇంటర్వ్యూలతో.. ప్రచారం హోరెత్తిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఈ చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. ట్వీట్ చేశారు.” చంద్రశేఖర్‌ యేలేటిగారు తీసుకునే కథలకు, ఆయన కథ చెప్పే విధానానికి నేను పెద్ద ఫ్యాన్ ని. ‘చెక్‌’ టీజర్ చూశాక.. సినిమాపై ఆసక్తి పెరిగింది. రేపు (శుక్రవారం) సినిమా విడుదల అవుతున్న సందర్భంగా చందూకి, నితిన్‌కి.. మిగతా చిత్రబృందానికి నా శుభాకాంక్షలు..” అని ఎన్టీఆర్‌ ట్వీట్ చేశారు. ఇక ఎన్టీఆర్‌ నుంచి అనుకోని ఈ సర్‌ప్రైజ్‌కు చిత్రబృందం సంతోషం వ్యక్తం చేస్తూ.. ధన్యవాదాలు తెలుపుతోంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు