Home ప్రత్యేకం చిరు-బాబీ మూవీ క్రేజీ అప్‌డేట్.. సినిమా ఆ రేంజ్‌లో ఉంటుందట!

చిరు-బాబీ మూవీ క్రేజీ అప్‌డేట్.. సినిమా ఆ రేంజ్‌లో ఉంటుందట!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. వీటిలో మోహ‌న్ రాజా డైరెక్ష‌న్ లో లూసిఫ‌ర్ రీమేక్‌, మెహ‌ర్ ర‌మేశ్ డైరెక్ష‌న్‌లో వేదాల‌మ్ రీమేక్ ఉన్నాయి. మ‌రోవైపు బాబీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాకు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు చిరు. బాబీ-చిరు కాంబోలో వ‌చ్చే సినిమా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ అని ఇప్ప‌టివ‌ర‌కు టాక్ ఉంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను బాబీ కోర్ట్ డ్రామాగా తెర‌కెక్కించ‌నున్నార‌ని, ఠాగూర్ సినిమా తరహాలో స‌మాజంలో జ‌రిగే లోపాల్ని ఎత్తి చూపే విధంగా స్టోరీ ఉంటుంద‌ని సమాచారం. కాగా, ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నుంది. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షిసిన్హాను హీరోయిన్ గా దాదాపు ఖ‌రారు చేసిన‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఈ క్రేజీ మూవీ సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలపై మ‌రికొంత‌కాలం ఆగితే స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు