Home ప్రత్యేకం చిరు 'ఆచార్య' సెట్స్‌కు సైకిల్‌పై సోనూసూద్.. వీడియో వైరల్

చిరు ‘ఆచార్య’ సెట్స్‌కు సైకిల్‌పై సోనూసూద్.. వీడియో వైరల్

మెగాస్టార్‌ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. కోకాపేటలో వేసిన భారీ దేవాలయం సెట్‌లో యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. అయితే ఈ సినిమాలో సోనూసూద్‌ ప్రతినాయకుడుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అతడు ఈ సినిమా సెట్స్‌కు సైకిల్‌ మీద వెళ్లాడు. హైదరాబాద్‌ రోడ్ల మీద సైకిల్‌ తొక్కుకుంటూ షూటింగ్‌కు వెళ్లిన సోనూసూద్‌ వీడియో, ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించాలన్న మెసేజ్ తో పాటు ఇలా సైక్లింగ్‌ చేయడం వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండొచ్చనే ఉద్దేశ్యంతో సోనూసూద్‌ ఈ పని చేసినట్టు తెలుస్తోంది. కాగా, ‘ఆచార్య’ చిత్రాన్ని మే 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. చిరంజీవి జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఇందులో సిద్ధ అనే పవర్‌ఫుల్‌ పాత్రలో నటిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకాలపై నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

అత్యంత ప్రముఖమైనవి

సన్‌రైజర్స్‌ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ నుంచి వార్నర్‌ తొలగింపు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021వ సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ని తప్పించి అతని స్థానంలో కేన్ విలియమ్సన్‌‌ని సారథిగా నియమించింది. తాజా...

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘పుష్ప’ మూవీ స్టోరీ..!!

'ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్‌-  అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మందనా కథానాయిక. ఈ చిత్రం ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇటీవలే ప్రకటించిన...

ప్రభాస్ మూవీ నుంచి తప్పుకున్న లెజెండ‌రీ డైరెక్టర్.. నిరాశలో అభిమానులు..!?

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఇక...

పుష్పరాజ్‌.. మరో రెండు రోజుల్లో ముగించేస్తున్నాడు!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు